![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్-690 లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. కళ్ళు తిరిగిపడిపోయిన వసుధారని రిషి కారులో తీసుకెళ్తుంటాడు. అంతలో మెలుకువ వచ్చిన వసుధార హాస్పిటల్ కి ఏం వద్దు ఇంటికి వెళ్దామని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటుండగా రిషి ఏదో అనేసరికి వసుధార అలిగి కార్ ఆపమని చెప్పి, మధ్యలోనే దిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి ఒక్కడే కార్ లో కొంత దూరం ముందుకు వెళ్ళాక.. "రిషి వసుధారలు వేరు వేరు కాదు.. మేమిద్దరం రిషిధారలమే అని తనలో తానే అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు.
రిషి వాళ్ళ ఇంటికెళ్ళేసరికి దేవయాని హాల్లోని సోఫాలో కూర్చొని ఉంటుంది. అప్పటికే దేవయాని తన కోడలు ధరణితో మాట్లాడుతుంటుంది. రిషిని చూసిన దేవయాని.. ఏమైంది రిషి అలసిపోయావా? రిషికి కాఫీ తీసుకురా ధరణి అని చెప్తుంది. వద్దు పెద్దమ్మ.. నేను అలసిపోలేదు.. హ్యాపీగా ఉన్నానని చెప్పి, అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన సంతోషాన్ని జగతి, మహేంద్రలకి చెప్పాలని వసుధార వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి రిషి గురించి వసుధార, జగతి, మహేంద్ర, చక్రపాణి మాట్లాడుకుంటారు.
సరిగ్గా వాళ్ళు మాట్లాడే సమయానికి రిషి అక్కడికి వెళ్తాడు. రిషికి ఇన్నిరోజులు తెలియదు. మొత్తానికి ఈ రోజు తెలిసిందని మహేంద్రతో జగతి అంటుంది. అప్పుడే అక్కడికి రిషి వస్తాడు. రిషి ఆ మాటలు విని.. క్లాప్స్ కొడతాడు. రిషి వాళ్ళ నాన్న మహేంద్ర.. రిషి మై సన్ అని తనని హత్తుకోడానికి దగ్గరగా రాగా వద్దని చెప్తాడు. ఇప్పుడే నాకు తెలిసింది. వసుధార మెడలో తాళి ఎవరు కట్టారో మీకు ముందే తెలుసని, మీ అందరికి తెలిసి కూడా నాకు చెప్పలేదు. నన్ను పిచ్చోన్ని చేశారు కదా.. నా కళ్ళకి గంతలు కట్టి నాతో ఆడుకున్నారు కదా మీరంతా కలిసి అని అంటాడు. జగతి ఏదో మాట్లాడుతుండగా రిషి తనని ఆపి.. "మిమ్మల్ని ఎంత నమ్మాను మేడం.. మీరు కూడా ఇలా చేస్తారనుకోలేదు" అని చెప్తాడు. "వాళ్ళ తప్పేం లేదు రిషి సర్.. నేనే వాళ్ళని చెప్పొద్దని చెప్పాను" అని వసుధార అనగా... ఓహో నువ్వేనా ఈ నాటకానికి సూత్రధారి అన్నట్టుగా మాట్లాడతాడు రిషి. ఇప్పుడే అసలు కథ మొదలైందని రిషి అంటాడు. అందరికి ముందే తెలిసి, తనని ఫూల్ ని చేశారనకుంటున్న రిషి ఇకపై ఏం చేయనున్నాడో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |